ASR: డుంబ్రిగూడ మండలం గుంటసీమలో శనివారం అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీల ద్వారా అందుతున్న సేవలు, పీఎంఎంవై, మిషన్ వాత్సల్య, పీపీపీపై సీడీపీవో ఎస్తేరు రాణి అవగాహన కల్పించారు. అనంతరం కార్యకర్తలను గ్రామ పెద్దలు దుశ్శాలువాలతో సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీ సేవలపై అవగాహన


