హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రీ-సర్వే గ్రామ సభను పరిశీలించిన ఆర్డీఓ

KRNL: ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో శనివారం నిర్వహించిన రీ-సర్వే గ్రామ సభను ఫేస్-6 ఆదోని రెవెన్యూ ఆర్డీఓ అరుణ దేవి పరిశీలించారు. గ్రామ సభలో రీ-సర్వేకు సంబంధించిన అంశాలపై గ్రామస్థులతో సమీక్ష నిర్వహించి, వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు.