ASR: అరకువేలి మండలం మాదల పంచాయతీ పరిధిలోని కమలతోట-తుంగగెడ్డ మీదుగా ఒడిశా, సాలూరు వెళ్లే రహదారి, అర్ణబ్ తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా శిథిలమైందని సీపీఎం మండల కమిటీ సభ్యుడు కుమిడి రమేష్ శనివారం తెలిపారు. దీంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతుందన్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి'


