KRNL: పెద్దకడబూరు మండలం చిన్నతుంబలం గ్రామంలో దాదాపు రూ.కోటి వ్యయంతో చేపట్టిన సీసీ, బీటీ రహదారి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికే సీసీ రహదారి పనులు పూర్తికాగా, బీటీ రహదారి పనుల్లో భాగంగా కంకర పరిచి నెల రోజులు గడుస్తున్నా తదుపరి పనులు చేపట్టకపోవడంతో గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నత్తనడకన బీటీ రోడ్డు పనులు..!


