హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సబ్‌ పోస్టాఫీస్‌ కొనసాగించాలి'

PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో వందేళ్లుగా సేవలందిస్తున్న సబ్‌ పోస్టాఫీస్‌ను ఎల్విన్‌పేటకు తరలించే నిర్ణయాన్ని విరమించుకోవాలని గిరిజన సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో పోస్టాఫీస్‌కు అనుకూలమైన భవనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీని వలన ఆర్‌డీ, పీఎల్‌ఐ, ఆర్‌పీఎల్‌ఐ తదితర సేవల కోసం ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు.