హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛన్ల పంపిణీ ఆలస్యం: కలెక్టర్

KRNL: బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా అక్టోబర్ 1న కర్నూలు జిల్లాలో పింఛన్ల పంపిణీ మధ్యాహ్నం నుంచి చేపట్టనున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి శనివారం తెలిపారు. ఉదయం బ్యాంకుల నుంచి నగదు తీసుకుని, మధ్యాహ్నం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. లబ్ధిదారులు మార్పును గమనించాలని కలెక్టర్ సూచించారు.