హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చలో విజయవాడకు అనుమతి లేదు: ఎస్పీ

నంద్యాల జిల్లాలో సచివాలయ ఉద్యోగుల ఛలో విజయవాడ ధర్నాకు అనుమతి లేదని ఎస్పీ సునీల్ షోరాణ్ శనివారం తెలిపారు. అనుమతి లేకుండా నిరసనల్లో పాల్గొంటే సర్వెంట్ కండక్ట్ రూల్స్ ఉల్లంఘించినట్లేనన్నారు. విజయవాడ ధర్నాకు వెళ్లే వారిని డ్రోన్లు, కెమెరాలతో గుర్తిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని SP హెచ్చరించారు.