హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

సత్యసాయి: కదిరి పట్టణంలోని 6వ వార్డు కందికుంట నారాయణమ్మ కాలనీ, అమీన్ నగర్‌లో ఎస్సీసీఎస్పీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ భూమిపూజ చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే తన లక్ష్యమన్నారు. కదిరి అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు.