హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'28న PGRS తాత్కాలిక రద్దు'

 NLR: ఈనెల 28వ తేదీన సోమవారం నిర్వహించాల్సిన గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాగం ఈ ఏర్పాట్లలో నిమగ్నమై ఉందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.