WGL: తెలంగాణలో బొడ్డెమ్మ పండుగకు ఐదు రోజులే మిగిలి ఉండటంతో పల్లెల్లో సందడి మొదలైంది. మహిళలు తంగేడు, గునుగు, బంతి తదితర పూల సేకరణతో పాటు బొడ్డెమ్మ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బొడ్డెమ్మ వేడుకల అనంతరం తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంప్రదాయ పాటలు, కోలాటాలతో ఆడపడుచులు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ
బొడ్డెమ్మ పండుగకు ముస్తాబవుతున్న పల్లెలు


