హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులికాట్ సరిహద్దు వివాదంపై కీలక భేటీ

TPT: గుమ్మిడిపూండి MDO కార్యాలయంలో పులికాట్ సరిహద్దు వివాదంపై ఏపీ, తమిళనాడు అధికారులు, మత్స్యకారుల ప్రతినిధులు సమావేశమయ్యారు. సరస్సు సరిహద్దులను స్పష్టంగా నిర్ణయించాలని ఇరువర్గాల ప్రతినిధులు కోరారు. అవసరమైతే ఫ్రీజోన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న చేపల వేట విధానాన్ని కొనసాగించేందుకు అనుమతించాలని తమిళనాడు మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు.