BHPL: అక్టోబర్ 2న నిర్వహించే ప్రత్యేక గ్రామసభల్లో గ్రామాభివృద్ధి పనులపై ప్రజలతో చర్చించి తీర్మానాలు ఆమోదించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఎమ్మెల్యేతో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామానికి అవసరమైన పనులపై ముందుగానే ఇన్వెంటరీ సిద్ధం చేసుకోవాలని ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
'గ్రామాభివృద్ధి పనులపై ప్రజలతో చర్చించాలి'


