హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు వారాలుగా తాగునీటికి దూరం

TPT: బీఎన్ కండ్రిగ మండలం కుక్కంబాకం పరిధిలోని వడ్డిపాలెంలో రెండు వారాలుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామానికి నీటిని సరఫరా చేసే పంచాయతీ మోటార్ కాలిపోయినా ఇప్పటివరకు మరమ్మతులు చేయలేదని స్థానికులు తెలిపారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని వాపోయారు. నీటి కోసం మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.