KKD: జులై 25న పెద్దాపురం RDO నివాసంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు శివకుమార్‌ను అరెస్ట్ చేసినట్లు SP బిందు మాధవ్ వెల్లడించారు. అతని వద్ద నుంచి రూ. 15 లక్షల నగదు, 105.4 గ్రాముల బంగారం, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో ASP కిషోర్ కుమార్, పెద్దాపురం DSP తిలక్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్డీవో ఇంట్లో చోరీ.. నిందితుడు అరెస్ట్


