హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు

NRML: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని శనివారం జిల్లా రజక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిర్మల్  మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.