హైదరాబాద్: 28°C
వార్తలు

బీహార్ ఐపీఎస్‌కు అరుదైన గౌరవం

బీహార్ కేడర్ 2021 బ్యాచ్ IPS అధికారి మొహిబుల్లా అన్సారీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అత్యుత్తమ పోలీసింగ్, ప్రజా సంక్షేమ సేవలకు గానూ ఆయన 'ఏషియన్ హీరో అవార్డ్‌-2026'కు ఎంపికయ్యారు. చిన్నతనంలో చదువులో వెనకబడిన అన్సారీ.. పట్టుదలతో IITలో సీటు సాధించి, ఆ తర్వాత సివిల్స్‌లో సత్తా చాటి IPS అయ్యారు. ఇప్పుడు అంతర్జాతీయ అవార్డును దక్కించుకుని ఆదర్శంగా నిలిచారు.