హైదరాబాద్: 28°C
తెలంగాణ

RBSK టీం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు

PDPL: నంది మేడారం బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో RBSK బృందం, మేడారం PHC ఆధ్వర్యంలో శనివారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు. దగ్గు, జలుబు, జ్వరము, దురద మొదలైన రుగ్మతలకు చికిత్స అందించి, మందులు పంపిణీ చేశారు. డా. యాదగిరి, డా. సుష్మిత హెచ్ ఈ ఓ నరసింహారెడ్డి, వైద్య సిబ్బంది ప్రిన్సిపల్ విద్యాసాగర్ పాల్గొన్నారు.