హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నగరంలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీజేపీ ఘర్షణ

కరీంనగర్‌లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి నివాళులర్పించి వెళ్తుండగా, వారిని మాట్లాడించాలని బీజేపీ నాయకులు కోరారు. సమయం లేదని కాంగ్రెస్ అనడంతో ఇరువర్గాలు తోపులాటకు దిగాయి. పోలీసులు స్పందించి చెదరగొట్టడంతో పరిస్థితి శాంతించింది.