హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నదాతల నమోదు తప్పనిసరి: ఏఈవో

VKB: పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతు తమ వివరాలను పోర్టల్లో నమోదు చేసుకోవాలని చంగోముల్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి ఇలియాస్ సూచించారు. రైతు వేదికలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ నెల 30 వరకు గ్రామాల్లో ప్రత్యేక కేంద్రాల ద్వారా నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. రైతులు ఆలస్యం చేయకుండా పేర్లను తప్పక నమోదు చేయించుకోవాలని కోరారు.