హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

SRCL: ఇల్లంతకుంట మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎం.రాజు ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పోషించిన వీరోచిత పాత్ర చిరస్మరణీయమన్నారు. భూమి, హక్కుల కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.