ASF: తిర్యాణి మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు బూసి సంతోష్, ఉపాధ్యక్షుడు నల్లూరి రాజు, సంఘం నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు


