హైదరాబాద్: 28°C
తెలంగాణ

బక్కమంతులగూడెంలో తాగునీటి కష్టాలు

SRPT: మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం మర్రిచెట్టు ప్రాంతంలో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నా కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేయలేదు. చేతి పంపులు పనిచేయక, డ్రైనేజీ నీరు చేరి కలుషితమవుతున్నాయి. రాత్రివేళ బైక్‌లపై నీరు తెచ్చుకుంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.