హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వర్ష బాధితులకు పరిహారం చెల్లించాలి'

ASR: భారీ వర్షాలకు ఇళ్లు కూలి నిరాశ్రయులైన గిరిజన కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం శనివారం అరకులో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పలు గ్రామాల్లో ఇళ్ల గోడలు, పైకప్పులు దెబ్బతిన్నాయని తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారంతోపాటు బియ్యం, నిత్యావసర సరుకులు అందించాలని కోరారు. అధికారులు నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని సూచించారు.