హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గృహ నిర్మాణ రుణ మంజూరు పత్రాల పంపిణీ

ATP: తాడిపత్రి ఓం శాంతి నగర్‌లో సొంత స్థలాలు కలిగిన లబ్ధిదారులకు గృహ నిర్మాణాల కోసం మంజూరైన రూ.2.50 లక్షల రుణ పత్రాలను ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి ఇవాళ పంపిణీ చేశారు. సొంతింటి కల నెరవేరుతుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. పేదల గృహ నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తూ.. అవసరమైన సహాయం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.