హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూలమలుపుల్లో చెట్లతో ప్రమాదాలు

RR: కొత్తూరు మండలం సిద్ధాపూర్ నుంచి కోళ్లపడక వెళ్లే ప్రధాన రహదారిపై మూలమలుపుల వద్ద చెట్లు ఏపుగా పెరగడంతో వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా పెరిగిన చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.