హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేలంలో లడ్డూను దక్కించుకున్న ముస్లిం

NLG: నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంలలో 'టీం ఈగల్ స్పిరిట్' పేరిట యువకులు కొన్నేళ్లుగా గణపతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పదకొండు రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల అనంతరం శుక్రవారం రాత్రి గణపతి చేతిలో లడ్డును వేలంపాట నిర్వహించారు. గ్రామానికి చెందిన మహ్మద్ యూసుఫ్ రూ.17,116 లకు వేలంపాట పాడి లడ్డును దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యపర్చింది.