హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నపూర్ణ జలాశయానికి స్వల్పంగా వరద

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్దనున్న అన్నపూర్ణ జలాశయానికి స్వల్పంగా వరద కొనసాగుతోంది. శనివారం ఉదయం 6 గంటలకు జలాశయంలో 1.598 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం 389.39 మీటర్లకు చేరింది. 87 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా, ప్యాకేజీ-11, సర్‌ప్లస్‌ వేర్‌, ప్రధాన కాలువ ద్వారా అవుట్‌ఫ్లో లేదు. ఆవిరి తదితరాలకు 6 క్యూసెక్కుల నీరు వెళ్తోంది.