హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మంటల్లో కాలిపోయిన రూ.20 లక్షల నగదు

VKB: జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దౌల్తాబాద్(M) బండివాడ గ్రామంలో బండి అంజప్ప అనే వ్యక్తి ఇంట్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూ. 20లక్షల నగదు బూడిదపాలైంది. అంతేకాకుండా 4 తులాల బంగారం కూడా కాలి బూడిదైంది. దాదాపు రూ. 28 లక్షల నష్టం వాటిల్లడంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.