హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిజాయితీని చాటుకున్న యూత్ నాయకుడు'

KNR: కేశవపట్నం పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ సంపత్‌కి మానకొండూరు నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ షారుక్ దొరికిన రూ. 30 వేల విలువైన సెల్ ఫోన్‌ను అందించారు. దొరికిన వస్తువును నిజాయితీగా అందించడంతో పోలీసులు యజమానికి ఫోన్ చేసి తిరిగి అందించారు. నిజాయితీ చాటుకున్న షారుక్‌ను పోలీస్ అధికారులు, మండల ప్రజలు అభినందించారు.