హైదరాబాద్: 28°C
తెలంగాణ

జెండా బాలాజీ ఆలయంలో మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మహేష్ కుమార్ గౌడ్‌కు అర్చకులు, ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అనంతరం జెండాకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు తీర్థ ప్రసాదాలు అందజేశారు.