హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిగిలో రికార్డు ధర పలికిన లడ్డూ..!

VKB: పరిగి పట్టణంలోని బహార్ పేట్ హనుమాన్ దేవాలయం వద్ద గణేష్ నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం నిర్వహించారు. వేలంలో గున్నారం అనూష బాబి రూ.4,56,000కు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీవాసులు ఆమెను అభినందించారు. కమిటీ తరఫున సన్మానించారు. లడ్డూ వేలంతో మండపం వద్ద సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.