హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'

NLG: విద్యార్థులు డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని దేవరకొండ సీఐ వెంకట్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. ఈరోజు దేవరకొండ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించిన నశాముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. యువకులు, విద్యార్థులు డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని కోరారు.