హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోతుల బెడద పెరగడంతో స్థానికుల ఇబ్బంది

ASF: జిల్లా కేంద్రంలో కోతుల గుంపు స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. శనివారం ఓ ఇంట్లోకి చొరబడిన కోతులు సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో ఇళ్లలోకి ప్రవేశిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారని తెలిపారు.