హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వెనక్కి పడ్డ వినాయకుడి విగ్రహం

RR: రాజేంద్రనగర్ పత్తికుంట చెరువుకు టస్కర్ వాహనంపై వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా ప్రమాదవశాత్తూ అది వెనక్కి పడిపోయింది. లంగర్ హౌస్ పిల్లర్ నం.96 వద్ద శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. క్రేన్ సహాయంతో పోలీసులు విగ్రహాన్ని తొలగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.