VKB: బంట్వారం మండలంలో ప్రమాదాల నివారణకు రహదారుల్లోని ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని జడ్పీ సీఈవో సుధీర్‌బాబు ఆదేశించారు. మండల పరిషత్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల వివరాలను ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. సమావేశానికి పూర్తి సమాచారంతో హాజరుకావాలని అన్నారు.
తెలంగాణ
'మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి'


