హైదరాబాద్: 28°C
తెలంగాణ

నారింజ వాగు వద్ద దారి మళ్లింపు చర్యలు.!

SRD: ​జహీరాబాద్ మండలం కొత్తూర్ (B) గ్రామ శివారులోని నారింజవాగు వంతెన వద్ద వినాయక నిమజ్జనోత్సవం శనివారం కొనసాగుతోంది. పరిసర ప్రాంతాల నుంచి భారీగా వాహనాలు రావడంతో పోలీసులు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. బీదర్ వైపు నుంచి వచ్చే వాహనాలను న్యాల్కల్ మండలం గంగ్వార్ చౌరస్తా మీదుగా దారి మళ్లించి, విగ్రహాలను వరుస క్రమంలో నిమజ్జనానికి అనుమతిస్తున్నారు.