హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం'

WNP: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి, ధైర్యసాహసాలు నేటి తరానికి ఆదర్శమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం ఐడీఓసీలో ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొని చిత్రపటానికి నివాళులర్పించారు. భూమి, భుక్తి, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని అన్నారు.