హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానం

JN: బచ్చన్నపేట మండలం కేసిరెడ్డిపల్లిలో అక్టోబర్ 1న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని మాజీ MLA, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆహ్వానపత్రిక అందజేసి, ఏర్పాట్ల గురించి వివరించారు.