హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మకు వినూత్న నివాళి.!

SDPT: చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని గజ్వేల్‌కు చెందిన ప్రముఖ కళాకారుడు రామకోటి రామరాజు సబ్బుబిళ్లపై ఐలమ్మ చిత్రాన్ని రూపొందించి వినూత్నంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐలమ్మ జీవితం ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తికి ప్రతీక అని అన్నారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ఆమె చూపిన తెగువ తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.