హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

RR: చేవెళ్లలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అణచివేతను ఎదిరించి ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయాలన్నారు.