హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెడకు చుట్టుకున్న వైర్లు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం.

WGL: వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో శనివారం ప్రమాదం తృటిలో తప్పింది. ట్రాక్టర్‌పై వెళ్తున్న యువకుడి మెడకు విద్యుత్ స్తంభాలకు వేలాడుతున్న ఇంటర్నెట్, డిష్ వైర్లు చుట్టుకున్నాయి. అప్రమత్తమైన యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. అస్తవ్యస్తంగా వేలాడుతున్న వైర్లను అధికారులు వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.