హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొందుగలలో ఇరువర్గాల పరస్పర దాడులు

PLD: దాచేపల్లి మండలం పొందుగల వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. NRTకు చెందిన నిమజ్జన బృందం ట్రాక్టర్‌ను రోడ్డుపై నిలపడంతో స్కూల్ బస్సు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ట్రాక్టర్‌ను పక్కకు జరపాలని డ్రైవర్ కోరడంతో వాగ్వాదం జరిగి ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు విద్యార్థి తల్లిదండ్రుల్లో ఒకరికి గాయాలయ్యాయి.