AKP: తుఫాన్ తగ్గడంతో, అనకాపల్లి జిల్లాలో శనివారం ఉదయం వరకు సగటున 1.5 మి.మీ మాత్రమే వర్షం నమోదైంది. అత్యధికంగా రాంబిల్లిలో 9.8 మి.మీ, బుచ్చయ్యపేటలో 8.2 మి.మీ, అచ్యుతాపురంలో 6.2 మి.మీ కురిసింది. ఎస్.రాయవరం, సబ్బవరం మినహా 17 మండలాల్లో పొడి వాతావరణం ఏర్పడింది. ఈ వానలతో సెప్టెంబర్‌లో 81.8 శాతం అధిక వర్షపాతం రికార్డై, సీజన్ లోటు భర్తీ అయింది.
ఆంధ్రప్రదేశ్
తగ్గిన తుఫాన్.. భర్తీ అయిన లోటు


