ATP: జిల్లాలో పోలీస్ శిక్షణ కళాశాల మైదానంలో కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. DTC, PTCలో శిక్షణ పొందిన 689 మంది కానిస్టేబుళ్లకు ఇవాళ పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమం నిర్వహించారు. పాసింగ్ అవుట్ పెరేడ్‌లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, MLA రమాదేవి అదనపు SPలు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్.. హాజరైన మంత్రి!


