SKLM: ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాల అసాంఘిక చర్యలకు నిలయంగా మారిందని గ్రామస్థులు వాపోతున్నారు. రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ఆవరణలోకి వచ్చి మద్యం సేవిస్తూ సీసాలు పగలగొట్టడం, బాత్రూం డోర్లు విరిచేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'అసాంఘిక చర్యలకు నిలయంగా పాఠశాల'


