హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విస్తృతంగా పారిశుధ్య పనులు'

PPM: ఆర్ణబ్ తుఫాన్ ప్రభావంతో గత మూడు రోజులుగా జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో, వర్షానంతర పరిస్థితులపై జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తమైంది. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. వర్షాల వల్ల ఎక్కడా పారిశుధ్య లోపం తలెత్తకుండా బ్లీచింగ్ చల్లుతున్నారు.