హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీలింగ్‌ భూమిని కాపాడాలని ఫిర్యాదు

జనగామ(M) అదవీకేశ్వాపూర్‌లోని కల్లుగీత కార్మిక భూమిని కాపాడాలని జిల్లా KGKS ప్రధాన కార్యదర్శి వెంకట మల్లయ్య ఎంఆర్‌ఓకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. కొందరు వ్యక్తులు ఎవ్వరి అనుమతులు లేకుండా జేసీబీలతో తవ్వకాలు చేపడుతూ తాటి చెట్లను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ పట్టాలను రద్దు చేసి, సంఘానికి చెందిన 2 ఎకరాల భూమిని కాపాడాలని కోరారు.