NZB: బోధన్ మండలంలోని బేలాల్ గ్రామానికి చెందిన రైతు రామిసింగ్ పట్టణంలోని రైతు డిపోలో కొనుగోలు చేసిన పురుగు మందును రెండున్నర ఎకరాల పంటకు పిచికారీ చేయగా పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతు డిపో ఎదుట నిరసనకు దిగారు. నష్టపోయిన రైతుకు వెంటనే పరిహారం చెల్లించాలని రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
పురుగు మందుతో పంట ఎండిపోయిందని రైతు ఆందోళన


