హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిశువు మృతి.. రూ.5 లక్షల పరిహారం

ADB: రిమ్స్ ఆస్పత్రిలో నవజాత శిశువు మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. లింగాపూర్ మండలం మూలగూడకు చెందిన దుర్గాబాయి, మారుతి దంపతులకు రూ.5 లక్షల చెక్కును ఐటీడీఏ పీవో మకరందు అందజేశారు. కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.