హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోలేటి గ్రామంలో పందుల స్వైర విహారం

ASF: రెబ్బెన మండలం గోలేటి గ్రామ పంచాయతీలోని సింగరేణి కాలనీలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు గోలేటి గ్రామపంచాయతీలో పందులను వదిలి వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు నివసించే ప్రాంతాల్లో పందులు స్వైర విహారం చేస్తుండడంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.